అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం​ జగన్​

అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడి రైతులకు మేలు
అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం వైస్​ జగన్​మోహన్​రెడ్డి
లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం

అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం​ జగన్​ అమరావతి : అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు కలుగుతుందని సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ , అమూల్‌ కార్యకలాపాలను బుధవారం సీఎం జగన్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశానన్నారు. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చామని జగన్ గుర్తుచేశారు. మార్కెట్‌లో పోటీతత్వం ఉంటేనే రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. అమూల్‌తో ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందన్నారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్‌ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వివరించారు. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చు కుందని సీఎం జగన్ పెర్కొన్నారు.