ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళం
వరంగల్ టైమ్స్,తిరుపతి: టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళాన్ని తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ తనయుడు కుప్పాల నీలేష్ కుమార్ గురువారం అందించారు. ఈ మేరకు విరాళం డిడిని టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కి తిరుపతిలోని అడిషనల్ ఈవో నివాస గృహంలో దాత అందజేశారు. ఈ సందర్భంగా దాత కుప్పాల నీలేష్ కుమార్ ను అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించారు.














