నటరాజన్​తో షమీకి కష్టమే..

నటరాజన్​తో షమీకి కష్టమే..కాన్​బెర్రా : ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన టీ20లో నటరాజన్​ మరోసారి తన అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో జడేజా స్థానంలో వచ్చినా చహాల్​ మ్యాచ్​ విన్నర్​గా నిలిచారు. అయితే నటరాజన్​ బౌలింగ్​ను తక్కువ అంచనా వేయొద్దు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్​ సంజయ్​ నటరాజన్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. నటరాజన్​ రాకతో టీ20లో మహ్మదషమీకి కష్టమే అని ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. షమీ స్థానాన్ని నటరాజన్​ భర్తీ చేస్తారని చెప్పారు.