8న భారత్​ బంద్​ కొనసాగిస్తాం

8న భారత్​ బంద్​ కొనసాగిస్తాం
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించినప్పటికీ ఈ నెల 8న భారత్​ బంద్​ కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అటు కేంద ప్రభుత్వం ఇటు రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ముందుకుపోతున్నారు. శనివారం కూడా రైతులతో జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. కాగా డిసెంబర్​9న మరోసారి చర్చలకు ఆహ్వానించగా రైతులు అంగీకరించినట్లు సమచారం. అయినప్పటికీ 8న నిర్వహించనున్న భారత్​బంద్​ కొనసాగుతుందని రైతు సంఘాలు తెలిపాయి.