మూసీ మురిసేలా మహాత్ముడు !

మూసీ మురిసేలా మహాత్ముడు !

మూసీ మురిసేలా మహాత్ముడు !వరంగల్ టైమ్స్, హైదరాబాద్: లంగర్హౌస్ మూసీ నదికి పర్యాటక సొబగులు అద్దుకోనున్నాయి. నది సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.మూసీ, ఈసా, గోదావరి నదులతో త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్లోనే 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసిందే. ఉగాది నుంచి గాంధీ సరోవర్ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు.దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడు విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ కాంస్య విగ్రహం పట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు). ఇక సరోవర్ లో ఏముంటాయంటే.. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంలో గాంధీ సరోవర్ ను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 8 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్ లో 52 ఎకరాలు కేంద్ర రక్షణ శాఖకు చెందినవి ఉన్నాయి.

ఇందులో ఇప్పటికే 38.09 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అంగీకరించగా, మిగిలిన భూమి కోసం సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. నది పరీవాహక ప్రాంతాన్ని హ్యాపెనింగ్ ప్లేస్ గా , నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గాంధీ సరోవర్ లో గాంధీ తత్వశాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ లైఫ్ హిస్టరీని వివరించే ఆడిటోరియాలు, ఫోటో ఎగ్జిబిషన్లను, ధ్యాన మందిరం వంటివి ఉంటాయి. వ్యాపార, ఆర్థిక కార్యకలాపాల కోసం హెటళ్లు, రెస్టారెట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లు , షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానవనాలు, ఇతరత్రా సదుపాయాలను అభివృద్ధి చేస్తారు.