9,10వ తరగతి పరీక్షల్లో ఇక 6 పేపర్లే..

9,10వ తరగతి పరీక్షల్లో ఇక 6 పేపర్లే..

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : 9, 10వ తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ సర్కారు సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి 9, 10వ తరగతుల పరీక్షలను కేవలం 6 పేపర్లతోనే నిర్వహించనున్నది. 2022-23 నుంచి ఈ సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఒక్కో సబ్జెక్ట్ లో పరీక్షలకు 80, ఫార్మేటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్ పేపర్ లో ఫిజక్స్, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.9,10వ తరగతి పరీక్షల్లో ఇక 6 పేపర్లే..అయితే గతంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం 10వ తరగతి వార్షిక పరీక్షలను 11 నుంచి 6 పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా 9, 10 తరగతులకు ఆరేసి పేపర్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘీక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా నిర్వహించేవారు. ఇక హిందీ సబ్జెక్ట్ కు ఒకే పరీక్ష నిర్వహించేవారు.