టీమిండియా ఘన విజయం, సిరీస్ కైవసం

టీమిండియా ఘన విజయం, సిరీస్ కైవసం

టీమిండియా ఘన విజయం, సిరీస్ కైవసంవరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. 229 పరుగుల లక్ష్యంతో దిగిన శ్రీలంకను భారత బౌలర్లు 137 రన్స్ కే కట్టడి చేశారు. నిస్సాంక (15), కుశాల్ (23), ఫెర్నాండో(1), ధనుంజయ (22), అసలంక (19), హసరంగ(9), కరుణరత్నే(0), శనక (23) రన్స్ చేశారు. అర్జీప్ 3, హార్దిక్, చాహల్, ఉమ్రాన్ తలా రెండు వికెట్లు, అక్షర్ 1 వికెట్ తీశారు.