సిబ్బంది శిక్షణ లోపమే కారణం: హైకోర్టు

సిబ్బంది శిక్షణ లోపమే కారణం
నేరేడ్​మెట్​ ఫలితంపై హైకోర్టు అభిప్రాయం

హైదరాబాద్​ : గ్రేటర్​ ఎన్నికల కౌంటింగ్​ నేరేడ్​మెట్​ మినహా పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే నేరేడ్​మెట్​లో స్వస్తిక్​ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈక్రమంలో ఇతర ముద్రలు ఉన్న ఓట్లపై సింగిల్​ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్​ఈసీ పిటిషన్​ దాఖలైంది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఈ తప్పిదానికి సిబ్బంది శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సోమవారం ఉదయం ఈ అంశంపై విచారణ జరుపాలని సింగిల్​ జడ్జికి ఆదేశాలు జారీచేసింది.