నిరుపేద విద్యార్థికి దాస్యం చేయూత

నిరుపేద విద్యార్థికి దాస్యం చేయూతవరంగల్ అర్బన్: నిరుపేద విద్యార్థి చదువుకై ఆర్థిక చేయూత నిచ్చి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. వరంగల్ బల్దియాలో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పోస్టల్ కాలనికీ చెందిన బాబు తనయుడు నెల్సన్ రాజ్ ఐఐటి గోవా లో సీటు సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , సీఎం కెసిఆర్ తక్షణమే స్పందించి లాస్ట్ ఇయర్ ఫీజు చెల్లించి నెల్సన్ రాజ్ చదువులకు సహకరించారు. అదే విధంగా బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ యేడాది విద్యాసంవత్సరానికి అయ్యే ఫీజు రూపాయలు 45 వేల చెక్కును బాధిత విద్యార్ధికి దాస్యం వినయ్ భాస్కర్ అందించారు. నెల్సన్ రాజ్ ఉన్నత చదువులకు అండగా ఉంటానని హామీ ఇస్తూ, మున్ముందు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.