ఏసీబీ వలలో చిక్కిన గుండాల ఎస్సై

ఏసీబీ వలలో చిక్కిన గుండాల ఎస్సైజనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గుండాల ఎస్సై చందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. గత నెల రోజులక్రితం ఖాసీం అనే వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకొని వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలివెళ్లిన ఖాసీం బెయిల్ పై రిలీజ్ అయినప్పటికీ ప్రతీ నెల మామూళ్లు 40వేల రూపాయలు ఇవ్వాలని ఎస్సై చందర్ డిమాండ్ చేయడంతో ఆందోళనకు గురైన ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ఎస్సై ని పట్టుకున్నారు. ఖాసీం డబ్బులు తీసుకొని ఎస్సై కి ఫోన్ చేయగా స్థానిక పెట్రోల్ బంక్ మేనేజర్ గణేష్ కు డబ్బులు ఇవ్వాలని ఎస్సై చెప్పడంతో గణేష్ కు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో గణేష్ తిరిగి ఎస్సై కి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.