ఆ కోర్టులో పేలుడు.. ఇద్దరు మృతి

ఆ కోర్టులో పేలుడు.. ఇద్దరు మృతిలుథియానా : పంజాబ్ లోని లుథియా కోర్టు కాంప్లెక్స్ లో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్ రెండో అంతస్తులోని బాత్రూంలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.

పేలుడు సంభవించడంతో బాత్రూం గోడ పూర్తిగా ధ్వంసం కాగా, సమీప గదులకు ఉన్న అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కోర్టు ఆవరణలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.