లవర్ కోసం కొట్లాడుకున్న ఇద్దరు అమ్మాయిలు

లవర్ కోసం కొట్లాడుకున్న ఇద్దరు అమ్మాయిలు

లవర్ కోసం కొట్లాడుకున్న ఇద్దరు అమ్మాయిలువరంగల్ టైమ్స్, విశాఖ జిల్లా : ప్రేమించిన అమ్మాయి కోసం పోట్లాడుకునే అబ్బాయిలను చూశాము కానీ ప్రేమించిన అబ్బాయి కోసం పోట్లాడే అమ్మాయిలను ఎక్కడా చూడలేదు. కానీ కనీవిని ఎరుగని రీతిలో ఓ వింత దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అనకాపల్లిలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినుల ప్రేమ వ్యవహారం గొడవలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇద్దరు విద్యార్థినులు ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్న విషయం కాస్త బయటికి వచ్చింది. దీంతో అసలు అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకోకుండానే ఆ ఇద్దరు విద్యార్థినులు లవర్ కోసం గొడవ పెట్టుకున్నారు. నేను ప్రేమిస్తున్నాను అంటే.. నేను ప్రేమిస్తున్నాను..నా వాడు అంటే…నా వాడు అంటూ పోట్లాడుకున్నారు. ఈ గొడవ కాస్త ఎక్కువై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది.

అయితే ఈ హాస్యాస్పద దృశ్యాలు చూసిన పలువురు ముక్కున వేలేసుకున్నారు. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుకోవడం ప్రస్తుత పాశ్చాత్య సంస్కృతికి అద్దం పడుతోందని అంటున్నారు. యుక్తవయసు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం, తల్లిదండ్రులు ఇస్తున్న స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తతంగం అంతా చూస్తుంటే భావితరాల భవిత ఎటువైపు పోతుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పాశ్చాత్య పోకడలకు పోయి, విదేశీ సంస్కృతి సంప్రదాయాలను అవలంభిస్తున్న నేటి విద్యా రంగాన్ని, విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.