ఆమె గది నుంచి దుర్వాసన, వెళ్లి చూస్తే షాకింగ్

ఆమె గది నుంచి దుర్వాసన, వెళ్లి చూస్తే షాకింగ్

ప్రియుడితో జూనియర్ ఆర్టిస్ట్ సహజీవనం, గది నుంచి దుర్వాసన, వెళ్లి చూస్తే షాకింగ్

వరంగల్ టైమ్స్హైదరాబాద్‌ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుళ్లిన స్థితిలో ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ మృతదేహం లభ్యమైంది. కుత్బుల్లాపూర్‌ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. మూడు నెలలుగా కిరణ్‌ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లోని ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తోంది. ఆమె గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన సమాచారంతో బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఆమె గది నుంచి దుర్వాసన, వెళ్లి చూస్తే షాకింగ్గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహం స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అనురాధ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే అనురాధకు తెలియకుండా కిరణ్‌ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఇదే విషయంపై నిలదీయడంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని చెబుతున్నారు. ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేకే అనురాధ బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడు కిరణ్‌ కోసం గాలింపు చేపట్టారు.