గోపవరం మండల ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే చెవిరెడ్డి

గోపవరం మండల ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే చెవిరెడ్డితిరుపతి : వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోపవరం మండల ఇంచార్జీగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్ కడప జిల్లాలోనే గోపవరం మండలం ప్రత్యేకతను సంతరించుకుంది.

జిల్లాలో టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్న ఏకైక మండలంగా గోపవరం నిలిచింది. బద్వేల్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో రాష్ట్ర రాజకీయం ఒక్క సారిగా సీఎం సొంత జిల్లా వైఎస్సార్ కడప వైపు మల్లింది. బద్వేల్ నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాలు అట్లూరు, కలసపాడు, బి.కోడూరు, అవదూత కాశీనాయిన, పోరుమామిళ్ళ, గోపవరం ఉన్నాయి.

రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్ ఎన్నికలకు ఇంఛార్జిలను నియమించారు. ప్రత్యేకించి గోపవరం మండలానికి మాత్రం నమ్మకస్తుడైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇంఛార్జి బాధ్యతలను అప్పగించారు.