నిరక్షరాస్యులైన వయోజనుల కోసమే అక్షర భారత్

నిరక్షరాస్యులైన వయోజనుల కోసమే అక్షర భారత్హనుమకొండ జిల్లా : చదువుంటేనే మనిషి జీవితం సంపూర్ణం అవుతుంది. చదువుకోవడానికి వయోబేధం అడ్డురాదు..పైగా చదువుకోవాలనే తపన వుంటే ఏ వయసులోనైనా విద్యనభ్యసించవచ్చు. పైగా నిరక్షరాస్యులైన పెద్దవాళ్లు చదువుకోవడం వల్ల వారిలో మానసిక ధైర్యం పెరుగుతుందన్న మాట వాస్తవం. ఆ దిశగానే వయోజన విద్యను ప్రోత్సహిస్తున్నారు.

ఇందులో భాగంగానే నగరంలోని 31వ డివిజన్ లో అక్షర భారత్ జిల్లా కోఆర్డినేటర్ పత్తిపాక కవిత ఆధ్వర్యంలో అక్షర భారత్ సెంటర్ ను బుధవారం అక్షర భారత్ జిల్లా కో ఆర్డినేటర్ బొడ్డు క్రాంతి, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు ప్రారంభించారు. అనంతరం అక్షర భారత్ ముఖ్య ఉద్దేశ్యాలను వారు వివరించారు.

ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులు కావాలని అక్షర భారత్ కో ఆర్డినేటర్ బొడ్డు క్రాంతి పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులైన వయోజనులు ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ అక్షరాస్యులు కావాలని కార్పొరేటర్ మామిండ్ల రాజు పిలుపునిచ్చారు. వయోజన విద్య ద్వారా మానసిక ధైర్యంతో మరింత బలంగా నిలబడతారని తెలిపారు.