‘జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష’ ప్రారంభం

'జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష' ప్రారంభంఅమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకాన్ని సీఎం వైఎస్​ జగన్​ సోమవారం ప్రారంభించారు.కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సర్వే రాయి వేసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.