మహాత్మా బసవేశ్వరుని మార్గదర్శనంలో వీరశైవ లింగాయతులు
– ధర్మాచరణతో ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి: డిప్యూటీ కమిషనర్ సునీత
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: శుక్రవారం ఉదయం చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయం ప్రాంగణంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్/ లింగ బలిజ సంఘం రూపొందించిన 2026 సంవ త్సరం డైరీని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత ఆలయ ప్రధాన అర్చకులు, రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మతో కలిసి ఆవిష్కరించారు. లింగాయత్ సమాజం యొక్క పూర్తి సమాచారంతో ప్రత్యేక ఆకర్షణతో డైరీని రూపకల్పన చేయడం పట్ల డిప్యూటీ కమిషనర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు.ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ వీరశైవులు సహజంగా శివుడిని ఆరాధిస్తూ బసవేశ్వరుడి ప్రేరణతో భక్తి భావంతో వ్యవహరిస్తూ తమదైన శైలిలో సమాజ హితం కోసం సమ భావన దృష్టితో జీవనం గడపడానికి ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. తనను డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వా మ్యం చేయడం పట్ల హర్షాన్ని ప్రకటించారు గంగు ఉపేంద్ర శర్మ. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం- హనుమకొండ జిల్లా ప్రతినిధులు- పట్నం శెట్టి వీర సోమయ్య, నానం రాజయ్య, గుండవరం విధుమౌళి, పట్నం శెట్టి శైలేష్ ప్రసాద్, దుర్గమ్మ సమ్మయ్య,పెనాల సమ్మయ్య, వెన్న కోటేశ్వరరావు, సాయం సాంబయ్య, దుర్గం మల్లికార్జున్- యువజన కమిటీ అధ్యక్షులు, వుప్పు శివకుమార్ ( సునీల్) రాచర్ల సాయి, ఉప్పు సతీష్ పాల్గొన్నారు.













