కృతి ఆ చాన్స్ కోసమే ఎదురుచూస్తుందట

కృతి ఆ చాన్స్ కోసమే ఎదురుచూస్తుందట

హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది కన్నడ బ్యూటీ కృతిశెట్టి. గత సంవత్సరం ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, నాని శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో వరుస విజయాలు అందుకున్నది. దీంతో కృతి శెట్టి పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మార్మోగుతోంది. ఈ బ్యూటీ కోసం నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ ..నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తోంది కృతిశెట్టి. ఇక ఇప్పుడు ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈమె ఓకే చేసే పనిలో పడింది. మరీ ముఖ్యంగా ఈమెకు ఇష్టమైన హీరోతో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

టాలీవుడ్ లో కృతిశెట్టి మనసు దోచిన ఆ హీరో ఎవరో కాదు రామ్ చరణ్. ఉప్పెన సినిమా సమయంలోనే ఈ విషయం గురించి ఓపెన్ అయింది కృతిశెట్టి. తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ అప్పట్లో చెప్పింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఆ చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టి పేరు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయిందంటే కృతి రేంజ్ మారిపోవడం ఖాయం. దీంతో బిగ్ లీగ్ లోకి ఎంట్రీ ఈజీగా దొరికనట్లే. మరోవైపు మెగా కాంపౌండ్ లోకి ఒక సారి వస్తే అవకాశాలు కూడా వాటంతట అవే వస్తాయి. మొత్తానికి ఉప్పెన హీరోయిన్ కెరీర్ ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోతుంది