స్వర్ణ పతకంతో మెరిసిన సాదియా తారిఖ్

స్వర్ణ పతకంతో మెరిసిన సాదియా తారిఖ్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: మాస్కో వేదికగా జరిగిన వుషు చాంపియన్ షిప్ లో భారత్ కు చెందిన సాదియా తారిఖ్ స్వర్ణ పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో లోకల్ ఫెవరేట్ ప్లేయర్ పై సాదియా అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి తనదైన దూకుడు కనబర్చిన సాదియా, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా పతకం సొంతం చేసుకుంది. శ్రీనగర్ కు చెందిన ఈ 15 యేండ్ల యువ ప్లేయర్ ఇటీవల జలంధర్ లో జరిగిన 20వ జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ లోనూ పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. మాస్కో టోర్నీలో సత్తాచాటిన సాదియాను ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ లో అభినందించారు.స్వర్ణ పతకంతో మెరిసిన సాదియా తారిఖ్