సిద్ధిపేటలో మెరిసిన విద్యా కుసుమం

సిద్ధిపేటలో మెరిసిన విద్యా కుసుమం

సిద్దిపేట జిల్ల్లా : నారాయణ రావు పేట మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ బండి కనకయ్య సునీత దంపతుల కూతురు అశ్విని సిద్దిపేట నియోజకవర్గం మిట్టపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో ఇంటర్ పూర్తి చేసి ఇటీవల జరిగిన ఎంసెట్ నీట్ ఎంట్రన్స్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశంలోనే 131వ ర్యాంకు సాధించింది. ఎంతో మంది వైద్యులుగా తీర్చిద్ధిద్దిన దేశంలోనే వైద్య కళాశాల అయిన ఢిల్లీలోని ఎయిమ్స్ లో సీటు దక్కించుకుంది. ఇందులో సిటు పొందిన మొట్ట మొదటి విద్యార్థినిగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గ బిడ్డ గా అశ్విని ఖ్యాతిని చాటింది. మంచి ర్యాంకు సాధించిన అశ్వినీ ని మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేకంగా అభినందించారు. మెడికల్ లో సిటు సాదించే విధంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు కనకయ్య సునీత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఊరి ఆడబిడ్డ దేశంలోనే ప్రఖ్యాత గాంచిన ప్రముఖ వైద్య కళశాల లో సిటు పొందడం పై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.