మాస్క్ ధరించకపోతే రెండు వేల జరిమాన ఎక్కడో తెలుసా?

ఢిల్లీలో మాస్క్ ధరించకపోతే
రెండు వేల జరిమాన
అధికారికంగా ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్మాస్క్ ధరించకపోతే రెండు వేల జరిమాన ఎక్కడో తెలుసా?దేశ రాజధాని నగరాన్ని కరోనా వణికిస్తున్న వేళ అక్కడి ప్రభు త్వం కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఒక రోజు నే కరోనా వైరస్ వల్ల 130 మంది వరకు ప్రజలు చనిపోయిన దృష్ట్యా ప్రభుత్వం ఈ చర్యలకు తీసుకుంది. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించనివారికి రూ.2వే లు జరిమానా విధించ నున్న ట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. కరోనా వైరస్ తీవ్రత పెరిగిన దృష్ట్యా ఇప్పటి వరకు రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలకు పెంచినట్టు ఆయన తెలిపారు. గురువారం అఖిల పక్ష సమా వేశం ముగిసిన అనంతరం ఆయన మీడి యాతో వివరా లను వెల్లడించారు.. దిల్లీలో కరోనా వైరస్‌ ప్రభావం దృష్ట్యా అదనంగా ఐసీయూ బెడ్‌లు, ఇతర వసతులు సమకూర్చిన కేంద్ర ప్రభు త్వా నికి కృతజ్ఞత లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల ను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు