‘సామ్‌ జామ్’‌షో లో మెగాస్టార్ చిరు సందడి

హైద‌రాబాద్‌: టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని వ్యాఖ్యాతగా ఆహా డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘సామ్‌ జామ్’‌. ‘ఆహా’ తన సబ్‌స్రైబర్లను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సమంతతో కొత్తగా ఈ షో అధినేత అయిన అల్లు అరవింద్‌ చేయిస్తున్నారు. ‘సామ్‌ జామ్’‌షో లో మెగాస్టార్ చిరు సందడి

కరోనా కారణంగా ఎలాగూ సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు సమంత కూడా ఇలా డిజిటల్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇక సామ్‌జామ్‌ షోలో సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో జనాలకు వినోదాన్ని పంచనున్నారు. కాగా పూర్తిస్థాయిలో ఓ షోకు సమంత్‌ హోస్ట్‌గా చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. నవంబర్‌13న ఈ షో లాంఛనంగా ప్రారంభమవ్వగా.. మొదటి ఎపిసోడ్‌లో అర్జున్‌ రెడ్డి ఫేం విజయ్‌ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చారు.

‘సామ్‌ జామ్’‌షో లో మెగాస్టార్ చిరు సందడిఈ క్రమంలో సామ్‌జామ్‌లో ఓ ఎపిసోడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి కూడా రానున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అన్నట్లుగానే తాజాగా చిరంజీవి సామ్‌జామ్‌ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఎపిసోడ్‌ త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది. మున్ముందు ఎపిసోడ్‌లలో తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ పారుపల్లి, అల్లు అర్జున్‌ కూడా సమంత షోలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది.