త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్`.
హైదరాబాద్: కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించడానికి గుడ్ సినిమా గ్రూప్ సమాయత్తమైన విషయం తెలిసిందే..అందులో భాగంగా శ్రీముఖి, భరణి, మనో, పోసాని కృష్ణ మురళి,రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం `క్రేజీ అంకుల్స్`. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఒక పాట మినహా పూర్తయ్యింది. శ్రీముఖి, మనో, రాజారవీంద్ర, భరణి, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, గిరిధర్, హేమ, గాయత్రి భార్గవి, విజయ మూర్తి, వాజ్పై, మహేంద్ర నాథ్, సిందూరి, మాధురి తదితరులు నటిస్తోన్న
ఈ చిత్రానికి…
కథ, మాటలు: డార్లింగ్ సామి,
సినిమాటోగ్రఫీ: పి. బాలరెడ్డి,
సంగీతం: రఘు కుంచె,
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి,
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే,
స్టిల్స్: పిల్.గణపతి,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అడ్డాల శ్రీనివాస్, ఆనంద్ తాళ్లూరి,
లైన్ ప్రొడ్యూసర్: సాయిబాబు వాసిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి,
ఫైనాన్స్ డైరెక్టర్: రవి కొమ్మినేని,
ప్రజెంట్స్: కిరణ్ కె తలసిల,
కోప్రొడ్యూసర్: లయన్ వై కిరణ్,
ప్రొడ్యూసర్స్: గుడ్ ఫ్రెండ్స్,
డైరెక్టర్: ఇ. సత్తిబాబు.