పేదల వైద్యానికి సర్కారు పెద్దపీట : దాస్యం

పేదల వైద్యానికి సర్కారు పెద్దపీట : దాస్యం

వరంగల్ టైమ్స్ , హనుమకొండ : అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక ఆర్థిక వెసులుబాటు అందుతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు దాదాపు రూ. 10 లక్షల విలువైన 6 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందచేశారు. నగరంలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన దాస్యం వినయ్ భాస్కర్ వారికి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్ధికంగా చతికిలబడిన కుటుంబాలకు స్థానిక ప్రజాప్రతినిధులు లేదా నాయకుల ద్వారా తెలుసుకుని వారికి అండగా ఉంటున్నామని చీఫ్ విప్ గుర్తు చేశారు.పేదల వైద్యానికి సర్కారు పెద్దపీట : దాస్యంహైదరాబాద్ నగరం తరువాత రెండవ అతి ముఖ్యమైన ఓరుగల్లు నగరంలో హెల్త్ సిటీ నిర్మాణ వ్యాప్తి శరవేగంగా జరుగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ దవాఖానను దాదాపు రూ.1200 కోట్ల నిధులతో నిర్మించి సర్కారు వైద్యానికి పెద్దపీట వేసి వైద్యానికి దూరమైన ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు అన్ని సదుపాయాలతో కూడిన వైద్యాన్ని అందించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే రెండవ విడత కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించి లక్షలాది మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను కూడా అందించడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు. అత్యాధునిక వసతులతో మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులను నెలకొల్పి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెస్తుందని ఆయన తెలిపరాు. ఈ సందర్భంగా ఆయన ప్రజల తరపున సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎలకంటి రాములు, మామిండ్ల రాజు, కూడా డైరెక్టర్ మాడిశెట్టి శివ శంకర్, డివిజన్ అధ్యక్షులు సమద్ తదితరులు పాల్గొన్నారు.