కాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ కబ్జా కేసు నమోదు 

కాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ కబ్జా కేసు నమోదు

కాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ కబ్జా కేసు నమోదు 

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పార్టీలకు అతీతంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమిపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ పై గత రాత్రి మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి భూమి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు మరియు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ జరిపారు. ఈ విచారణలో

కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో పోలీస్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసినట్లు సమాచారాం. గత కొద్ది రోజులుగా వరంగల్ కమిషనర్ పోలీసులు కబ్జారాయుళ్లపై అణచివేత ధోరణిని ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తుండడంతో తమ భూములను స్థలాలను భూ అక్రమణదారుల నుండి పరిరక్షించుకోవడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.