టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ సూసైడ్

టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ సూసైడ్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ విశాఖలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఎట్ ఆలేరు, కుందనపు బొమ్మ సినిమాల్లో సుధీర్ వర్మ నటించాడు. కుందనపు బొమ్మ సినిమాలో సుధాకర్ కోమాకులతో కలిసి వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్ గా నటించాడు.టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ సూసైడ్సుధీర్ వర్మ ఆకస్మిక మృతి పట్ల సుధాకర్ కోమాకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. సుధీర్ వర్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు. సుధీర్ వర్మ అంత్యక్రియలు నేడు లేదా రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.