టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు రిలీజ్

టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు రిలీజ్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జనవరి 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది.

ఈ ప్రక్రియ మొత్తం 37 రోజుల్లో పూర్తికానుంది. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై సాధారణ పరిపాలన శాఖ గతంలో నిషేధం విధించింది. ఈ మేరకు జీవో-91ను జారీచేయగా, ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ గురువారం రాత్రి జీఏడీ జీవోను విడుదల చేసింది.