ఆ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు తగ్గింపు!

ఆ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు తగ్గింపు!

ఆ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు తగ్గింపు!వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనుంది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం 10-15 కళాశాలల్లో పాత ఫీజులలో కోత విధించగా, అధికశాతం కాలేజీలకు గత ఫీజులే కొనసాగనున్నాయి. 20 లోపు కళాశాలలకు 10-15 శాతం వరకు స్వల్ప పెంపు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలనలో ఉంది. సీఎం ఆమోదం అనంతరం జీవో వెలువడనుంది. 2025-28 బ్లాక్‌ పీరియడ్‌కు ఈ ఫీజులు వర్తిస్తాయి.