కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు మొదలెట్టింది:కేటీఆర్

కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు మొదలెట్టింది:కేటీఆర్

కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు మొదలెట్టింది:కేటీఆర్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కునేది బీఆర్ఎస్ పార్టీయేనని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల అనంతరం కేటీఆర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2582 వార్డుల్లో బీఆర్ఎస్ 750 వార్డుల్లో విజయం సాధించిందన్నారు. దాదాపు 30 శాతం మున్సిపాలిటీలు గెలుస్తున్నామన్నారు. నేరుగా దాదాపు 15 నుంచి 16 మున్సిపాలిటీల్లో గెలిస్తే మరో 15 నుంచి 16 చోట్ల అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచామన్నారు. కాంగ్రెస్ పార్టీ భారీగా అక్రమాలు, అవినీతికి పాల్పడిందని మరోసారి తెలిపారు.

హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ పార్టీ మరింత అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ పీఠాల కైవసానికి కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలు పెట్టిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, ఈ ఎన్నికల్లో స్పష్టంగా తేలిపోయిందన్నారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అటు పల్లె, ఇటు పట్టణాల్లో ప్రజలు తేల్చారని అన్నారు. హైదరాబాద్ సహా ఇతర కార్పొరేషన్ లలో ఇదే ఉత్సాహంతో ముందుకు పోతామని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేశారంటూ కేటీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు.