టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న వైభవ్ సూర్యవంశీ

టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న వైభవ్ సూర్యవంశీ

టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న వైభవ్ సూర్యవంశీవరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడు. బీహార్ లోని సమస్తిపుర్ లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ లో వైభవ్ ఈ పరీక్షలు రాయనున్నారు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానున్న ఈ పదో తరగతి పరీక్షలను సూర్యవంశీ తమ స్కూల్లోనే రాయనున్నట్లు ప్రిన్సిపల్ నీల్ కిషోర్ ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు. వైభవ్ క్రికెటర్ అయినందున అందుకు తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు పరీక్షలు రాయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల అండర్-19 వన్డే వరల్డ్ కప్ లో ఈ యువ క్రికెటర్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ లో 80 బంతుల్లో 175 పరుగులు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.