భార్య మటన్ వండలేదని 100 కి ఫోన్ చేసిన భర్త

భార్య మటన్ వండలేదని 100 కి ఫోన్ చేసిన భర్త

వరంగల్ టైమ్స్, నల్లగొండ జిల్లా : భార్య మీద కోపంతో 100కు డయల్ చేసి కంప్లైట్ చేసి ఓ భర్తకు తగిన శాస్తే జరిగింది. భార్య మటన్ వండమంటే వండలేదన్న క్షణికావేశంలో 100కు పదే పదే డయల్ చేసిన ఆ భర్త కంప్లైట్ పై పోలీసులు ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ ఆ తాగుబోతు భర్తకి బుద్ది చెప్పాలనుకున్న పోలీసులు తగిన శిక్షే విధించారు. వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ హోలీ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చాడు.భార్య మటన్ వండలేదని 100 కి ఫోన్ చేసిన భర్తభార్యను మటన్ వండాలని కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నవీన్ ఊగిపోయాడు. అవమానంగా ఫీల్ అయ్యాడు. జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కి ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. ఇది సిల్లీ విషయం అని పోలీసులు లైట్ తీసుకున్నారు. కానీ నవీన్ వదలకుండా ఆరు సార్లు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి పోలీసులను విసిగించాడు. దీంతో నవీన్ కు బుద్ధిచెప్పాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. పెట్రోలింగ్ పోలీసులు అతని ఇంటికి చేరుకున్నారు.

నవీన్ మద్యం మత్తులో ఉండటంతో వెనుదిరిగారు. మరుసటి రోజు పోలీసులు నవీన్ ఇంటికి వచ్చి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐసీసీ సెక్షన్ 290, 510 కింద కేసు పెట్టారు. కాగా, ఆపదలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100 సౌకర్యాన్ని దుర్వినియోగం చేయవద్దని కనగల్ ఎస్సై నగేశ్ ప్రజలను కోరారు. సంబంధం లేని విషయంపై 100కు ఫోన్ చేసి పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసినందుకు నవీన్ పై కేసు పెట్టినట్లు వివరించారు.