ఫ్లోరైడ్ పోరాట యోధుడు అంశాల స్వామి మృతి 

ఫ్లోరైడ్ పోరాట యోధుడు అంశాల స్వామి మృతి

ఫ్లోరైడ్ పోరాట యోధుడు అంశాల స్వామి మృతి 

వరంగల్ టైమ్స్, నల్లగొండ జిల్లా : ఫ్లోరోసిస్ పోరాట యోధుడు అంశాల స్వామి అకాల మరణం చెందారు. ఇటీవల తనకు ఓ వ్యక్తి బహూకరించిన ఎలక్ట్రిక్ బైక్ పై శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లి వచ్చిన స్వామి, ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అంతర్గతంగా రక్తస్రావమై శనివారం ఉదయం 6.30 గంటలకు మృతి చెందారు.

ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. స్వామి అకస్మాత్తుగా మృతి చెందడంతో కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్తూ సొంత ఖర్చులతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. కర్నాటి విద్యాసాగర్ కు బాధ్యత అప్పగించి దగ్గరుండి చూసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పలుమార్లు ఫోన్ లో వాకబు చేశారు.

స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి శివన్నగూడెంలో స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని స్వామి కుటుంబానికి భరోసా ఇచ్చారు. అంత్యక్రియలకు గ్రామస్థులతో పాటు పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు భారీగా హాజరయ్యారు.