ఫ్లోరైడ్ పై అంశాల స్వామిది అలుపెరుగని పోరు 

ఫ్లోరైడ్ పై అంశాల స్వామిది అలుపెరుగని పోరు

ఫ్లోరైడ్ పై అంశాల స్వామిది అలుపెరుగని పోరు 

వరంగల్ టైమ్స్, మర్రిగూడ : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల సత్యనారాయణ-వెంకటమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన స్వామి పుట్టుకతోనే ఫ్లోరైడ్ బాధితుడు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడంలో సమైక్య పాలకుల వివక్షను నిరసిస్తూ, సామాజిక ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణతో కలిసి స్వామి ఫ్లోరైడ్ భూతంపై యుద్ధాన్ని ప్రకటించారు.ఆ తర్వాత సోషల్ వర్కర్ కంచుకట్ల సుభాష్ స్థాపించిన ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో సీఎంలు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల వద్ద తన గోడును వినిపించాడు.

2003 లో దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో మరో ఫ్లోరైడ్ బాధితుడు కొత్తపల్లి నర్సింహతో కలిసి ఢిల్లీ వెళ్లిన స్వామి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి టేబుల్ పై పడుకొని తమ గోస చెప్పుకున్నారు. స్వామి పరిస్థితిని చూసి వాజపేయి చలించిపోయినా, సరైన పరిష్కారం చూపలేకపోయారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై స్వామి యుద్ధం ప్రకటించడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కమిటీ వేసింది. కృష్ణా జలాల సరఫరాతోనే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమవుతుందని స్వామి ఆ కమిటీకి తేల్చి చెప్పారు.