గురుకులాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

గురుకులాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

గురుకులాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ (Telangana Government)ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. డిటైల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్ సిద్ధం చేయాలని సూచించింది. జిల్లా షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.ఆకస్మిక సందర్శనలతో పాటూ పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. తనిఖీ నివేదికలను వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. అధికారులు తీసుకున్న చర్యల వివరాలు వెంటనే తెలియజేయాలని హుకుం జారీ చేసింది. ప్రతి నెలా 5వ తేదీలోపు నివేదిక సమర్పణని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.