ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు

ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు

– మొత్తం పరీక్షా కేంద్రాలు: 1,537
– హాజరయ్యే విద్యార్థులు: 10,57,312 మంది
– పరీక్ష సమయం: ఉదయం 9:00 గంటలకు
– ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
– టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1800 425 1531

ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలువరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 1537 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది విద్యార్థుు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి పి.రంజిత్ భాషా తెలిపారు.

విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. పరీక్షా హాల్ లోకి మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ నిషేధమని తెలిపారు. ప్రతీ గదిలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నాని, ఏదైనా అనుమానాలున్నా, పరీక్షలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1800 425 1531 నంబర్ ను సంప్రదించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.