ఎన్ఐటీలో సందడి చేసిన అడివి శేషు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: వరంగల్ ఎన్ఐటీ వార్షిక సాంస్కృతిక ఉత్సవం స్ప్రింగ్ స్ప్రీ-2026 ఫిబ్రవరి 26 గురువారం సాయంత్రం 7:15 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ ఎన్ఐటీ రెండ్రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలను సినీ నటుు అడివి శేషు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో రెండు రోజుల సాంస్కృతిక వేడుకలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి డీన్ (స్టూడెంట్ వెల్ఫేర్) ప్రొఫెసర్ కిరణ్ కుమార్, SACఅధ్యక్షుడు ప్రొఫెసర్ పి. హరి ప్రసాద్ రెడ్డి, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీవితంలో గెలుపోటములు సహజమన్నారు. విద్యార్థులు పాజిటివ్ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. ఇక తాను యూరప్ లో జరుగుతున్న షూటింగ్ కార్యక్రమాల నుంచి నేరుగా ఎన్ఐటీకి వచ్చినట్లు తెలిపారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ విద్యార్థులతో కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అలాగే స్పింగ్ స్ప్రీ సాంస్కృతిక బృంద సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి కృషి, సమన్వయం మరియు నిబద్ధతను ప్రశంసించారు. విద్యార్థులు తమ కలలను సాధించడానికి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల జోష్ తో క్యాంపస్ ఆడిటోరియం సందడిగా మారింది.ప్రారంభ కార్యక్రమంలో భాగంగా స్ప్రింగ్ స్ప్రీ-2026పై ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శించారు.
అలాగే అడివి శేషు సినీ ప్రయాణంపై ప్రత్యేక ఏవీ (AV)ప్రదర్శించారు. “Dacoit” సినిమా టీజర్ ప్రదర్శనతో పాటు, “Rubaru” పాట టీజర్ ప్రదర్శించారు. ఓల్డ్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం తదనంతరం ఓల్డ్ ఆడిటోరియంలో “Rubaru” పాట అధికారికంగా విడుదల చేశారు. అనంతరం సుమారు ఒక గంట పాటు అడివి శేషు మరియు సినిమా బృందంతో విద్యార్థుల ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించబడింది. సినిమా నిర్మాణం, కథనం మరియు సృజనాత్మకతపై జరిగిన ఈ చర్చ విద్యార్థులకు ప్రేరణనిచ్చింది. స్ప్రింగ్ స్ప్రీ-2026 విజయవంతమైన ప్రారంభంతో ఎన్ఐటీ వరంగల్లో సాంస్కృతిక ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాలు విద్యార్థుల ప్రతిభను మరింత వెలుగులోకి తీసుకురానున్నాయి. సాంస్కృతిక వైభవంతో ప్రారంభమైన స్పింగ్ స్ప్రీ వేడుకల్లో తెలంగాణ గర్వకారణమైన పేరిని నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏడు బృందాల ద్వారా శక్తివంతంగా ప్రదర్శించబడిన పేరిని నృత్యం సమన్వయంతో కూడిన నృత్య కదలికలు మరియు ఉత్సాహభరిత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నృత్య ప్రదర్శనల అనంతరం గౌరవ అతిథులు జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు.డీన్ (స్టూడెంట్ వెల్ఫేర్) విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. SACఅధ్యక్షుడు నిర్వాహక విద్యార్థులు మరియు వాలంటీర్ల కృషిని అభినందించారు.













