ఐలోని జాతరకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండలంలో ఈనెల 13 నుంచి మార్చి 22 ఉగాది వరకు ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ జాతరకు టీపీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంఛార్జ్ నమిండ్ల శ్రీనివాస్ ఆహ్వానించారు. నేడు హైదరాబాద్ లో ని రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన నమిండ్ల శ్రీనివాస్, ఐనవోలు మల్లన్న జాతరకు రావల్సిందిగా రేవంత్ ను కోరారు. దీంతో వారి ఆహ్వానాన్ని రేవంత్ రెడ్డి స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నమిండ్ల శ్రీనివాస్ తో పాటు గర్మిలపెళ్లి ఎంపీటీసీ బిరం మౌనిక -దేవేందర్ రెడ్డి, నందనం బ్యాంకు డైరెక్టర్ మెట్ చిరంజీవి, పంతిని ఉపసర్పంచ్ బండి మహేందర్, సమ్మెట మహేందర్, కొత్తూరి సునిల్, మొహమ్మద్ రహీమ్ పాషా, బరిగేలా భాస్కర్, బరిగేలా భరత్,యకరా సాంబయ్య, బొమ్మినేని రాకేష్ రెడ్డి,గదేరా భాస్కర్, కుస చిరంజివి, మాడూరి మల్లేశం,ఇల్లందుల సారయ్య, ఇల్లందుల ఎలీషా, పైండ్ల సంపత్, రాజు, హరీష్ రెడ్డి,తమ్మడపల్లి సుమన్, బండి సంపత్, గబ్బేట అశోక్, గబ్బేట అనిల్ మరియు కాంగ్రెస్ వీర అభిమానులు పాల్గొన్నారు.