ఆ పరీక్షలకు వర్సిటీల పేర్లు ఖరారు

 ఆ పరీక్షలకు వర్సిటీల పేర్లు ఖరారు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణలో 2023-2024 విద్యాసంవత్సరానికి గాను ఎంసెట్ తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీల పేర్లను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్ల పేర్లను కూడా ఉన్నత విద్యామండలి నియమించింది.

టీఎస్ ఎంసెట్, టీఎస్ పీజీ ఈసెట్ నిర్వహన బాధ్యతలను హైదరాబాద్ జేఎన్టీయూకి అప్పగించగా, టీఎస్ లా సెట్ ,పీజీ లా సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీకి, టీఎస్ ఎడ్ సెట్ ను నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి, పీఈ సెట్ ను కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి, టీఎస్ ఐ సెట్ ను కాకతీయ యూనివర్సిటీకి కట్టబెట్టింది.

ఇక యూనివర్సిటీల కన్వీనర్ల పేర్లు..
టీఎస్ ఐసెట్ కన్వీనర్ -ప్రొఫెసర్ పి.వరలక్ష్మి ( కేయూ)
టీఎస్ ఈసెట్ కన్వీనర్ -ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ (ఓయూ)
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ కన్వీనర్ -ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి ( ఓయూ)
టీఎస్ పీఈసెట్ కన్వీనర్ -ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ ( ఓయూ)
టీఎస్ ఎడ్ సెట్ కన్వీనర్ -ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ ( ఓయూ)
టీఎస్ ఎంసెట్ కన్వీనర్ -ప్రొఫెసర్ బి.డీన్ కుమార్ (జేఎన్టీయూహెచ్ )
టీఎస్ పీజీ ఈసెట్ కన్వీనర్ -ప్రొఫెసర్ బి.రవీంద్రరెడ్డి (జేఎన్టీయూహెచ్ )