టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు బదిలీలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరో రెండు, మూడ్రోజుల్లో పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.