డూప్లికేట్ దేవుడు మీద పోక్సో కేసు..

డూప్లికేట్ దేవుడు మీద పోక్సో కేసు..

డూప్లికేట్ దేవుడు మీద పోక్సో కేసు..వరంగల్ టైమ్స్, యాదగిరి జిల్లా: ప్రజల నమ్మకాన్ని, అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుంటూ, పసిపిల్లల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న 30 ఏళ్ల వయసున్న మొహల్ రాజ్ మఠం స్వామి మల్లికార్జున ముత్యపై పోక్సో కేసు నమోదు అయింది. ఓ బాలిక పుట్టిన రోజునాడు ఆశీస్సుల కోసం తల్లి, తండ్రి బాలికను మఠానికి తీసుకొచ్చారు. ఆ బాలికను తన వడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా తడుముతూ, అభ్యంతరకరంగా తాకుతూ ఉన్న వీడియోలు బయటపడ్డాయి. దీంతో శిశు సంరక్షణ అధికారులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో వివిధ కోణాలలో విచారణ చేపట్టిన పోలీసులు, అధికారులు స్వామీజీ ముసుగులో ఆ నీచుడు చేసే పనులను బయటపెట్టారు. దీంతో అతడి పాపం పండి కేసు నమోదు అయింది. నేడు, రేపో అరెస్ట్ తప్పేట్టు లేదు.. కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న యాదగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నీచుడు మఠం కూడా యాదగిరి లోనే ఉంది.