భద్రకాళి సన్నిధిలో కలెక్టర్ దంపతుల పూజలు

భద్రకాళి సన్నిధిలో కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు

భద్రకాళి సన్నిధిలో కలెక్టర్ దంపతుల పూజలువరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఆదివారం ఉదయం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎన్.పి.డి.సి.ఎల్ సి.ఎం.డి వరుణ్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆలయ కార్యనిర్వహణాధికారి రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మూగా శ్రీనివాసరావులు పూర్ణకుంభం, మంగళవాద్యాలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులను, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.