మైనర్ బాలికపై పూజారి అత్యాచారం

మైనర్ బాలికపై పూజారి అత్యాచారం.. నెట్టింట వీడియో వైరల్

*సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఘటన
*మైనిక బాలికపై అత్యాచారం చేసిన పూజారి సాయిలు
*పూజారి అరాచకాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానిక యువత
*పూజారి సాయిలుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

మైనర్ బాలికపై పూజారి అత్యాచారంవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రపురం మార్కెట్ సమీపంలో ఓ చిన్న అమ్మవారి గుడి ఉంది. అక్కడ సాయిలు అనే వ్యక్తి పూజారిగా విధులు నిర్వహిస్తూ పూజా కార్యక్రమాలు చేస్తుంటాడు. అయితే, ఇటీవల కాలంలో పూజారి సాయిలు ఆలయానికి వచ్చే మైనర్ బాలికల పట్ల అసభ్యంగా, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. పూజారి అరాచకాలను ఎలాగైనా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించిన స్థానిక యువకులు కొంతమంది పక్కా పథకం ప్రకారం మాటు వేశారు.

ఈ క్రమంలోనే పూజారి సాయిలు ఒక మైనర్ బాలికను వెంటబెట్టుకుని గుడిలోకి వెళ్లాడు. వెంటనే గుడి తలుపులను బయటి నుంచి గడియ పెట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న యువకులు తమ ఫోన్లలో వీడియో తీస్తూ, ఒక్కసారిగా బలవంతంగా గుడి తలుపులు తెరిచారు. గుడి తలుపులు తీసేసరికి పూజారి సాయిలు కనీసం అమ్మవారు కళ్లముందు ఉన్నారన్న పవిత్రతను కూడా మరచిపోయి, మైనర్ బాలికతో అత్యంత అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నట్లు యువకులు గుర్తించారు.

ఆ సమయంలో పూజారి ప్యాంటు కూడా వేసుకోకుండా ఉండటాన్ని చూసి స్థానికులు ఖంగుతిన్నారు. దేవాలయం పవిత్రతను మంటగలుపుతూ కామంతో కళ్లుమూసుకుపోయి పూజారి చేసిన ఈ నీచమైన పనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల ఫిర్యాదు మేరకు నిందితుడు పూజారి సాయిలుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలైన మైనర్ బాలికను విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో, ఇలాంటి కామాంధుల వల్ల పవిత్రమైన హిందూ ధర్మానికి తీవ్ర మచ్చ వస్తోందని నిఖార్సైన హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.