శభాష్ పోలీస్..ఆగిన గుండెకు ప్రాణం పోశాడు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : విధులు నిర్వర్తించడంలో వృత్తి బాధ్యతను నెరవేర్చడమే కాదు, సాటి మనిషిగా సాయం చేయడంతో పాటు ప్రాణాలు నిలబెట్టే పోలీసులను సైతం మనం చూస్తున్నారు. అటుగా వెళ్తుంటే ఎవరైనా అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తులను చూసి నాకెందుకులే అని చూసీ చూడనట్లు వెళ్తారు. కానీ విధుల్లో తన బాధ్యతను నెరవేర్చుతూనే అపస్మారక స్థితిలో తనకు కనిపించిన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు ఓ కానిస్టేబుల్. దేవుడిలా వచ్చి ఆగిపోయిన గుండెకు ప్రాణం పోసి ఆ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టాడు.
హైదరాబాద్ కానిస్టేబుల్ దేవుడిలా మారి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. ఆరాంఘర్ చౌరస్తా వద్ద బాలరాజు అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ అతడికి సీపీఆర్ చేశాడు. చాలా సేపు సీపీఆర్ చేశాక ఆ వ్యక్తిలో చలనం వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. సో మనం కూడా ఈ కానిస్టేబుల్ కి ఓ సెల్యూట్ చేద్ధాం.