ఆఫ్గాన్‌ భారత టూర్‌.. షెడ్యూల్‌ ఇదే

ఆఫ్గాన్‌ భారత టూర్‌.. షెడ్యూల్‌ ఇదే

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: జూన్‌లో ఆఫ్గాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా భారత్‌తో ఆ జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. టెస్టు మ్యాచ్‌ జూన్‌ 6న న్యూచండీగఢ్‌ వేదికగా ప్రారంభం కానుంది. తొలి వన్డే జూన్ 14న (ధర్మశాల) , రెండో వన్డే 17న (లఖ్‌నవూ), మూడో వన్డే 20న (చెన్నై) జరగనుంది. ప్రముఖ వేదికల్లో జరుగనున్న ఈ సిరీస్ రెండు జట్లకు కీలకమైన పోటీగా మారనుంది