8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష 

8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష

వరంగల్ టైమ్స్ , అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. విజయ్ కుమార్, శ్యామలరావు, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, గోపాలకృష్ణ ద్వివేదీ, బుడితి రాజశేఖర్ , ఎంఎం నాయక్ కు రెండు వారాల జైలు శిక్షతో పాటుగా జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించింది. వెంటనే ఐఏఎస్ లు క్షమాపణ కోరడంతో జైలుశిక్ష తప్పించి, సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. యేడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది.8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని ఐఏఎస్ లను ఆదేశించింది. విద్యార్థుల మధ్యాహ్నం, రాత్రి భోజన ఖర్చులు భరించాలని తీర్పు వెల్లడించింది. సామాజిక సేవకు అంగీకరిస్తే క్షమాపణలను అంగీకరిస్తామని పేర్కొన్నది. సామాజిక సేవ చేసేందుకు 8 మంది ఐఏఎస్ లు సిద్ధపడినట్లు వెల్లడించడంతో జైలు శిక్ష విధింపు తీర్పును సవరించినట్లు హైకోర్టు పేర్కొంది.