నేడు వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం

నేడు వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : చైనా రాజధాని బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ వేడుకలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. వారం రోజుల పాటు జరుగబోయే ఈ మంచు క్రీడలకు దాదాపు 90 దేశాల నుంచి ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మొత్తం 3 వేలకు పైగా అథ్లెట్లు ఈ వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడనున్నారు. భారత్ నుంచి ఈ సారి ఒక్కరు మాత్రమే వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొననున్నారు. జమ్ము కశ్మీర్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ అనే అథ్లెట్ స్కీయింగ్ లో పోటీ పడనున్నాడు. 1964 నుంచి భారత్ వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొంటుంది. అయితే ఇప్పటి వరకు వింటర్ మంచు క్రీడల్లో ఒక్క పతకం కూడా సాధించలేదు. అయితే ఈ సారి వింటర్ ఒలింపిక్స్ లో ఆరిఫ్ ఖాన్ పతకం సాధించే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.నేడు వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభంఇదిలా ఉండగా 7 క్రీడల్లో మొత్తం 109 విభాగాల్లో వింటర్ ఒలింపిక్స్ జరుగనుంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా విదేశీ వీక్షకులకు మైదానంలోకి అనుమతి లేదు. అలాగే వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్స్ కు అధికారులకు లూప్ సిస్టమ్ అనే బయో బబుల్ ను చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే అథ్లెట్స్ కు, అధికారులకు ఎప్పటికప్పుడు కరోనా నిర్దారణ పరీక్షలు కూడా చేయనున్నారు.