వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కొవిడ్ దృష్ట్యా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఐతే నెలాఖరు వరకు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాఠశాలలకు వెళ్లలేని వారికి ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. సమ్మక్క, సారక్క జాతరలో కొవిడ్ జాగ్రత్తలు ఉండాలని ఆదేశించింది. వీధి మార్కెట్లతో పాటు బార్లు, రెస్టారంట్లలో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది.
Home Education