బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కరోనా

బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కరోనాన్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్ కు వెళ్లినట్లు ఆయన ట్విట్టర్ లో తెలిపారు. కొన్ని రోజులు ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు చక్కబెట్టనున్నట్లు నడ్డా ప్రకటించారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు కోవిడ్ 19 నిర్ధారణ పరీక్ష చేయించుకుని క్వారంటైన్ లో ఉండాలని అభ్యర్థించారు.