తెలంగాణలో ఉద్యోగాల జాతర

తెలంగాణలో ఉద్యోగాల జాతరహైదరాబాద్: ఇన్ని రోజుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త .. ఎట్టకేలకు రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. పోలీసు, ఉపాధ్యాయ పోస్టులతో పాటు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారముందని, ఏ శాఖలో ఎంతమంది అవసరమో లెక్క తేల్చాక దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం వుంది.