రైతులకు అండగా పంజాబ్ డీఐజీ రాజీనామా

రైతులకు అండగా పంజాబ్ డీఐజీ రాజీనామాన్యూఢిల్లీ : కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే వుంది. రైతుల ఆందోళణ నేపథ్యంలో కొంతమేరకు మెట్టు దిగిన మోడీ ప్రభుత్వం మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు, చట్టాల్లో ఏడు కీలకమైన సవరమణలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే రైతులు మాత్రం ఆ నల్ల చట్టాల్లో ఏ సవరణలు చేసినా తమకు ఆమోదయోగ్యం కాదని, ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని తెగేసి చెప్పారు. ఇదిలా వుండగా , వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తున్న రైతులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. రైతుల పట్ల కేంద్ర వైఖరిని తమ నిరసనల ద్వారా ఎండగడుతూ పలువురు ప్రముఖులు రైతులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే రైతులకు మద్దతుగా పంజాబ్ డీఐజీ (జైళ్లు) లక్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ముందస్తుగా పదవీ వివరణ చేస్తున్నట్లు భావించాలని కోరుతూ పంజాబ్ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ పంపారు. రైతులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లక్మీందర్ సింగ్ తెలిపారు.